హైదరబాద్) చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల్ని ప్రజలకు మిగిల్చిన సంవత్సరంగా 2015 వెళ్లిపోతోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. విజయవాడ రాజధానిని అనేక రకాల మాఫియాలకు నిలయంగా మార్చిన ఘనత చంద్రబాబుదే అని ఆయన అభిప్రాయ పడ్డారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.అప్పులు కట్టలేక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకొనిపోతున్నారని, ఈ విషయంలో ఏపీ మొత్తం భారత దేశంలోనే అగ్రగామిగా మారిందని అంబటి వ్యాఖ్యానించారు. పక్క రాష్ట్రంలో లంచం ఇస్తూ చంద్రబాబు రెండ్ హ్యాండెడ్ గా దొరికిపోయి, తర్వాత కాలంలో కేసీయార్ తో కుమ్మక్కైన సంవత్సరంగా దీన్ని చెప్పవచ్చని అన్నారు. సింగపూర్ కంపెనీలకు సర్వం దోచిపెడుతున్న సంవత్సరం అని, ఇది మహిళల వ్యతిరేక ప్రభుత్వం అని ఆయన అభివర్ణించారు.