అలిపిరిలో 1,116 కొబ్బరికాయలు కొట్టిన భూమన

తిరుపతి, 4 అక్టోబర్‌ 2012: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి న్యాయం జరగాలని కోరుతూ పార్టీకి చెందిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో 1,116 కొబ్బరికాయలు కొట్టారు. అలిపిరిలోని శ్రీవారి పాదాల వద్ద పార్టీ శ్రేణులు, వైయస్‌ అభిమానులు గురువారం నాడు ఈ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ, జగన్మోహన్‌రెడ్డి ప్రజా సంక్షేమం కోసం కడిగిన ముత్యంలా జైలు నుంచి బయటికి వస్తారని అన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు సీబీఐని పావుగా వాడుకుంటున్నాయని ‌ఆరోపించారు.‌ ఆ రెండు పార్టీలు కూడబలుక్కుని, కుట్ర చేసి ఏ తప్పూ చేయని జగన్ను జైలు పాలు చేశాయని ఆయన నిప్పులు చెరిగారు. ఎప్పటికీ న్యాయమే గెలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
Back to Top