అధైర్య పడొద్దు..అండగా ఉంటాం..!

వరంగల్ః మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి తనయ, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల పరామర్శయాత్ర వరంగల్ జిల్లాలో కొనసాగుతుంది. మలివిడత పరామర్శయాత్రలో భాగంగా రెండో రోజు  వైఎస్ షర్మిల ఐదు కుటుంబాలను పరామర్శిస్తారు. తొలుత పాలంపేటలో ఫహీముద్దీన్ కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శించారు. అక్కడి నుంచి బయలుదేరి అజ్మీరా గోపానాయక్ కుటుంబాన్ని ఓదార్చారు. 

మళ్లీ మంచిరోజులు వస్తాయని... ఏఇబ్బంది వచ్చినా మేమున్నామని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మృతిని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబసభ్యులకు షర్మిల భరోసానిచ్చారు. అధైర్యపడొద్దు అండగా ఉంటామని ధైర్యం నింపారు.  
Back to Top