'ఆనం అధికార కార్యక్రమాలను బహిష్కరిస్తా'

నెల్లూరు, 16 ఏప్రిల్‌ 2013: ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొనే అధికార కార్యక్రమాలను తాను బహిష్కరిస్తున్నట్లు వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌కి చెందిన కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి తెలిపారు. నెల్లూరులో మంగళవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.‌ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆనం సోదరులు ఓటమి తప్పదని నల్లపరెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరు ప్రజలు ఆనం సోదరులను రాజకీయంగా ఉరి తీస్తారని ప్రసన్నకుమార్రెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు.
Back to Top