ఆనాడెందుకు ప్రశ్నించలేదు 'ఆనం'?

విజయనగరం, 14 ఏప్రిల్‌ 2013: మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి కేబినెట్‌లో మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి తప్పు జరిగితే ఆనాడే ఎందుకు ప్రశ్నించలేదని బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు సూటిగా ప్రశ్నించారు. శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలంటూ అప్పుడు సంతకం చేసిన రామనారాయణరెడ్డి ఇప్పుడు ఎవరి మెప్పు కోసం అసందర్భ వ్యాఖ్యలు చేస్తున్నారని రంగారావు నిలదీశారు. మహానేత వైయస్‌ఆర్‌ కుటుంబంపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలపై రంగారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వోక్సు వ్యాగన్, మద్యం సిండికేట్ల వ్యవహారంలో విచారణ నుంచి తప్పించుకున్న ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మంత్రి ఆనం వ్యాఖ్యలను సమర్థించడం దురదృష్టకరం అని సుజయకృష్ణ రంగారావు వ్యాఖ్యానించారు.
Back to Top