9న రాష్ట్రపతిని కలవనున్న వైయస్‌ఆర్‌సీపీ బృందం


ఢిల్లీః ఈ నెల 9న వైయస్‌ఆర్‌సీపీ నేతలు రాష్ట్రపతిని కలవనున్నారు. వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం ఘటకు సంబంధించి పరిణామాలను రాష్ట్రపతికి వివరించనున్నారు. కేంద్ర సంస్థతో నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని రాష్ట్రపతిని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు, సీనియర్‌ నేతలు కోరనున్నారు. 

గ‌త నెల 25వ తేదీ విశాఖ ఎయిర్ పోర్టులో వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో న్యాయం కోసం రాష్ట్రపతి, కేంద్ర హోంశాఖ మంత్రి, గవర్నర్‌ను కలిసి నివేదిక ఇవ్వాలని నిర్ణయించారు. జాతీయస్థాయిలో  వైయ‌స్ఆర్‌సీపీపైన, తమ అధినేతపై బురద చల్లడమే  పనిగా..చంద్రబాబు ఇప్ప‌టికే రెండుసార్లు ఢిల్లీ వెళ్లారు. వైయ‌స్ జగన్‌ కేసులో చంద్రబాబు ఏ1, డీజీపీ ఏ2 అన్నారు. సరైన విచారణ జరగాలంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థ ద్వారానే నిజాలు బయటకు వస్తాయని ఈ మేర‌కు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌కు పార్టీ నేత‌లు విన‌తిప‌త్రం అంద‌జేశారు. అలాగే రెండు రోజుల క్రితం గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి ఫిర్యాదు చేశారు. ఈ నెల 9వ తేదీ రాష్ట్ర‌ప‌తిని క‌లిసి స్వ‌తంత్ర సంస్థ‌తో విచార‌ణ చేయించాల‌ని కోర‌నున్నారు. 
Back to Top