వైయస్‌ఆర్‌సీపీలోకి మాజీ సర్పంచ్‌ సహా 90 మంది కార్యకర్తలు చేరిక..

విశాఖఃజిల్లాలో వైయస్‌ఆర్‌సీపీలోకి భారీఎత్తున వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా రాంబిల్లి మండలం కుమ్మరాపల్లిలో వైయస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ కన్వీనర్‌ యూవీ రమణమూర్తి సమక్షంలో మండల కన్వీనర్‌ ఆధ్వర్యంలో టీడీపీ నుంచి వైయస్‌ఆర్‌సీపీలోకి  మాజీ సర్పంచ్‌ తేటకల సత్యనారాయణ, మాజీ ఉపసర్పంచ్‌ సేనాపతి మూలరాజు సహా 90 మంది కార్యకర్తలు చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.వైయస్‌ఆర్‌సీపీ సిద్ధాంతాలు, నవరత్నాల వంటి సంక్షేమ పథకాలు నచ్చి పార్టీలోకి చేరినట్లు వారు తెలిపారు.జననేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీసీ ఘన విజయం సాధిస్తుందని, పార్టీ గెలుపు అహర్నిశలు సైనికులా కృషిచేస్తామని తెలిపారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top