<strong>నెట్టెంపాడు ప్రాజెక్టు (మహబూబ్‌నగర్ జిల్లా)</strong>, 28 నవంబర్ 2012: షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 42వ రోజు షెడ్యూల్ ముగిసింది. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, దానికి మద్దతుగా నిలుస్తున్న టిడిపి తీరుకు నిరసనగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర చేస్తున్నారు. 42వరోజు పాదయాత్ర బుధవారం మహబూబ్‌నగర్ జిల్లాలోని నెట్టెంపాడు శివారల్లో ముగిసింది. షర్మిల బుధవారంనాడు 17.5 కిలోమీటర్లు నడిచారు. గద్వాల శివారులోని నోబెల్ స్కూల్ నుంచి ఉదయం మొదలైన పాదయాత్ర సంఘాల క్రాస్‌రోడ్, గోనుపాడు, ధరూర్, మన్నాపురం, నెట్టెంపాడు హైవే, నెట్టెంపాడు శివార్ల మీదుగా సాగింది. ఇప్పటివరకు షర్మిల 571.5 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. <br/>