రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి

కాకినాడ: ప్రభుత్వ నిర్లక్ష్యానికి విద్యార్థులు బలయ్యారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. గోదావరిలో పడవ ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ఎనిమిది నెలల్లో ఇది ఆరో పడవ ప్రమాదమని, ఇంకా ప్రభుత్వం ఎంత మందిని బలితీసుకుంటుందోనని భయాందోళన వ్యక్తం చేశారు. పడవ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు. 
Back to Top