– సిట్ అధికారులు వారం రోజులు విచారించినా ఏమీ తేల్చలేదు – దర్యాప్తు అధికారి పక్కీరప్పను ఎందుకు బదిలీ చేశారు?– చంద్రబాబు కనుసన్నలో దర్యాప్తు జరిగింది– హర్షవర్ధన్‌ను ఎందుకు విచారించలేదు– ఎయిర్‌పోర్టులోకి కత్తి ఎలా వచ్చిందో తేల్చలేదు– ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ చేస్తారా?– వాస్తవాలు కప్పిపుచ్చే దిశగానే విచారణ సాగింది– టీడీపీ నేతలను కాపాడేందుకు కేసును నీరుగారుస్తున్నారు– ఆపరేషన్ గరుడను సీఎం నమ్మితే శివాజీని ఎందుకు విచారించరు? – హత్యాయత్నం వెనుక ఎవరున్నారో తేల్చాలి– జర్నలిస్టులపై దాడి జరిగినా చంద్రబాబు స్పందించలేదు– చింతమనేని ప్రభాకర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలిఏలూరు: చంద్రబాబు కనుసన్నల్లోనే వైయస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిందని, ఈ ఘటన వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరో తేల్చాలని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని డిమాండు చేశారు. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ చేయించి టీడీపీ నేతలను కాపాడేందుకు కేసును నీరుగారుస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. శనివారం ఏలూరులో ఆళ్లనాని మీడియాతో మాట్లాడారు.
గత నెల 25వ తేదీన దేశంలోనే ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చ తెచ్చేలా విశాఖ ఏయిర్‌పోర్టులో వైయస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిందన్నారు. చంద్రబాబు నేతృత్వంలో నడుస్తున్న ఈ ప్రభుత్వంపై, దర్యాప్తుపై ఎలాంటి నమ్మకం లేదని మొదటి నుంచి చెబుతున్నామన్నారు. నిన్నటితో దర్యాప్తు ముగిసిందని, అందులో తేల్చింది ఏంటని ప్రశ్నించారు. ఆరు రోజులుగా సిట్ అధికారులు ఏవిధంగా ఆ హత్యాయత్నం సూత్రధారులు ఎవరో గుర్తించలేదన్నారు. ఈ కేసును ఎలా నీరుగార్చాలన్న అంశంపై అధికారులు తీవ్రంగా శ్రమించారని చెప్పారు. ఆ దర్యాప్తుతో ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. సిట్ దర్యాప్తు సంస్థ చేసిన పని ఆరు రోజుల విచారణలో కత్తి ఎయిర్ పోర్టులోకి ఎలా వచ్చింది? ఆ శ్రీనివాస్ వెనుక ఉన్న సూత్రధారులు ఎవరన్నది తేల్చకుండా కాల్‌డేటా వివరాలు బయటకు తీస్తున్నామని, బ్యాంకు అకౌంట్లు పరిశీలించామని చెప్పడంలో వాస్తవాలు వెలుగులోకి రాలేదన్నారు. నిందితుడు పని చేస్తున్న రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ టీడీపీ నాయకుడని, ఆ ఎయిర్ పోర్టును ప్రారంభించింది కూడా లోకేష్ అని తెలిపారు. టీడీపీతో సంబంధాలు ఉన్న హర్షవర్ధన్‌ను విచారించకుండా నామమాత్రంగా కార్యాలయానికి పిలిపించి తూతూమంత్రంగా విచారణ చేసి మసి పూసి మారడికాయ చేశారే తప్ప సిట్ అధికారులు వారం రోజుల్లో కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నారన్నారు.
దర్యాప్తు సంస్థ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పడిందని, ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే ఆ దర్యాప్తులో డీఎస్పీ స్థాయి అధికారి, మిగత సీఐలు, ఎస్‌ఐలు మాత్రమే ఉన్నారని, సీనియర్ ఐపీఎస్ అధికారులను నియమించలేదన్నారు. ఫక్కీరప్ప అనే సీనియర్ అధికారిని దర్యాప్తు అధికారిగా నియమిస్తామని చెప్పిన ప్రభుత్వం దర్యాప్తు పూర్తి కాకుండానే దర్యాప్తు మధ్యలోనే కర్నూలుకు బదిలీ చేశారన్నారు. ఇంత హడావుడిగా బదిలీ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. డీఎస్పీ స్థాయి అధికారితో దర్యాప్తు ఏవిధంగా జరుగుతుందో అందరికి తెలుసు అన్నారు. డీజీపీ అమరావతిలో ప్రెస్‌మీట్ పెట్టి ఘటన జరిగిన వెంటనే చెప్పింది అందరికి తెలుసు అన్నారు. రెండు గంటల వ్యవధిలోనే ఆ శ్రీనివాస్ వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త అని ఎలా తేల్చేస్తారని ప్రశ్నించారు. డీజీపీ దర్యాప్తును ప్రభావితం చేసే విధంగా మాట్లాడారని విమర్శించారు. నిందితుడి జేబులో పదమూడు పేజీల లేఖ ఉందని చెప్పారని తెలిపారు. కాలయాపన చేసేందుకే ఈ దర్యాప్తు చేశారని ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. వాస్తవాలు కప్పిపుచ్చే దిశగానే విచారణ సాగిందన్నారు. కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నమే చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు మాట్లాడుతూ..ఈ హత్యాయత్నం కావాలనే చేయించుకున్నారని పేర్కొన్నారని, మీరు చెప్పింది నిజమైతే మేమే అడుగుతున్నాం కదా ఒక స్వతంత్య్ర ప్రతిపత్తి గల సంస్థతో దర్యాప్తు చేయించాలని డిమాండు చేశారు. ఈ కేసులో అసలు నిందితులను బయటకు తీసుకురావాలని, లేదంటే టీడీపీ ప్రమేయంతోనే హత్యాయత్నం జరిగిందని భావించాల్సి వస్తుందన్నారు. టీడీపీ నాయకులను కాపాడేందుకు కేసును నీరుగార్చుతున్నారని విమర్శించారు. S
చింతమనేనిని శిక్షించాలిటీడీపీ నాయకులు జర్నలిస్టులపై దాడి జరిగినా చంద్రబాబు చోద్యం చూస్తున్నారని ఆళ్లనాని మండిపడ్డారు. ఈ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. బాధ్యతాయుతమైన కార్యక్రమాలు చేస్తున్న జర్నలిస్టులపై దాడులు చేయడం దుర్మార్గమన్నారు. సామాన్య ప్రజలకు ఎలాంటి రక్షణ ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. వెంటనే చింతమనేని ప్రభాకర్‌పై చర్యలు తీసుకొని చట్టబద్ధంగా అతన్ని శిక్షించాలని వైయస్‌ఆర్‌సీపీ తర ఫున డిమాండు చేశారు.