300కిలోమీటర్లు పూర్తయిన షర్మిల యాత్ర


రాతన:

మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన వైయస్ షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 300 కిలోమీటర్ల మైలు రాయి దాటింది. శనివారం మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో ఆమె ఈ మైలు  రాయిని దాటారు. తుగ్గలి నుంచి రాతన గ్రామానికి మధ్యలో ఆమె మూడు వందల కిలోమీటర్ల యాత్రను పూర్తిచేశారు. వేలాది మంది వెంట నడుస్తుండగా.. ప్రజలు జగన్నినాదాలు చేస్తుండగా ఆమె యాత్ర ఉత్సాహభరితంగా సాగుతోంది.

Back to Top