వైయస్‌ఆర్‌సీపీ విజయం ఖాయం


– 300 కుటుంబాలు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక
– కాంగ్రెస్‌– టీడీపీ పొత్తు అనైతిక కలయిక
నెల్లూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కలయిక ఎప్పుడో ఖాయమైందని పార్టీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం వెంకటాచలంలో కందుల వెంకటశేషయ్య ఆధ్వర్యంలో 300 కుటుంబాలు వైయస్‌ఆర్‌సీపీలో చేరాయి. వారికి ఎమ్మెల్యే గోవర్ధన్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ..

చంద్రబాబు చేతిలో దగా పడిన యువకులకు, మసీదుకు వచ్చిన వారికి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి టీడీపీ కండువాలు కప్పి ఆ పార్టీలో చేరినట్లు ప్రచారం చేశారన్నారు. చివరకు తీన్‌మార్‌ కొట్టే వారికి కూడా కండువాలు కప్పడం సిగ్గు చేటు అన్నారు. ముస్లిం మతపెద్దలందరూ కూడా కలిసి వచ్చి ఇవాళ అందరూ ఒకతాటిపైకి వచ్చి వైయస్‌ జగన్‌ నాయకత్వంలో పని చేస్తామని ముందుకు వచ్చారన్నారు. చంద్రమోహన్‌రెడ్డి వల్ల మోసపోయామని స్వచ్ఛందంగా వైయస్‌ఆర్‌సీపీలో చేరారన్నారు. ఇది శుభపరిణామమన్నారు. ఈ నియోజకవర్గంలో మళ్లీ వైయస్‌ఆర్‌సీపీ జెండా ఎగురవేస్తామని స్పష్టం చేశారు. నా విజయం నల్లేరుపై నడక మాత్రమే అని, గెలుపు ఎప్పుడో ఖాయమైందన్నారు. చంద్రబాబు–చంద్రమోహన్‌రెడ్డి అడ్డమైన గడ్డి తింటున్నారని, కాంగ్రెస్‌ పార్టీని ఆ నాడు విమర్శించిన వ్యక్తులు ఇవాళ పొత్తు పెట్టుకోవడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. దిక్కు తోచని స్థితిలో చంద్రబాబు ఉన్నారని విమర్శించారు. 

సాగునీరు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం
రైతులకు సాగునీరు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం టీడీపీది అని కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు.  దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో నెల్లూరు జిల్లాకు సాగునీరు ఇచ్చారన్నారు. నాడు వైయస్‌ఆర్‌పై ఉన్న నమ్మకంతో రైతులు నారుమడులు సాగు చేశారన్నారు. ఈ రోజు 400 టీఎంసీలు ఉన్నా కూడా శ్రీశైలం నుంచి నీటిని ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం అన్నారు. రైతులు ఇవాళ ఇబ్బందుల్లో ఉన్నారని, సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు, కరువు కవల పిల్లలని ఎద్దేవా చేశారు. పశువులకు కూడా తాగునీరు అందడం లేదన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి నీరు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతులకు నీరు ఇవ్వకపోతే ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. 
 
Back to Top