ముగిసిన 210వ రోజు పాదయాత్ర

గర్బాం(విజయనగరం) 15 జూలై 2013:

విజయనగరం జిల్లాలో శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర సోమవారం నాటికి 210రోజులు పూర్తయ్యింది. సోమవారం రాత్రి ఆమె గర్బాం వద్ద యాత్ర ముగించి, రాత్రి బసకు చేరుకున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిలను  ఫెర్రో అలాయిస్ పరిశ్రమల కార్మికులు కలిశారు. తమ గోడు వెళ్లబోసుకున్నారు. త్వరలోనే జగనన్న బయటకు వస్తాడని, సమస్యలన్నీ తీరుస్తాడని కార్మికులకు ఆమె భరోసా ఇచ్చారు. ప్రస్తుతం కిరణ్ కుమార్‌రెడ్డి సర్కారులో విపరీతమైన విద్యుత్తు కోతలతో పరిశ్రమలు మూతపడే పరిస్థితి దాపురించిందని శ్రీమతి షర్మిల విమర్శించారు.

Back to Top