200 యువకులు వైయస్‌ఆర్‌సీపీలో చేరికనెల్లూరు: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఆకర్శితులై పలువురు వివిధ పార్టీల నాయకులు వైయస్‌ఆర్‌సీపీలో చేరుతున్నారు. జననేత ప్రకటించిన నవరత్నాలతో మేలు జరుగుతుందని భావించి ఆయా పార్టీల నాయకులు వైయస్‌ఆర్‌సీపీలోకి క్యూ కడుతున్నారు. తాజాగా నెల్లూరు నగరంలో 200 మంది యువకులు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ..నెల్లూరులో పేదల ఇళ్ల పేరుతో టీడీపీ నేతలు దోచుకుంటున్నారని విమర్శించారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సీఎం కాగానే పేదలందరికీ పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top