వైయస్సార్‌సీపీలో చేరిన యువకులు, మహిళలు

నరసరావుపేటః వచ్చే ఎన్నికల్లో అందరమూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకొస్తేనే ప్రజలకు మంచి భవిష్యత్‌ ఉంటుందని ఎమ్మెల్యే డాక్టర్‌గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు. వార్డు పర్యటనలో భాగంగా 26వ వార్డులో ఎమ్మెల్యే డాక్టర్‌గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈసందర్బంగా లెనిన్‌నగర్‌లో మోటుపల్లి అంజిబాబు ఆధ్వర్యంలో జి.చినరాజు, పెదరాజు, జి.వెంకయ్య, ఆయన కుమారులు తదితర 20 కుటుంబాలకు చెందిన మహిళలు, యువకులు పార్టీలో చేరారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి వారందరికీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.... వార్డుల్లో సమస్యలు తీరాలన్నా , సంక్షేమ ఫలాలు అందరికీ అందాలన్నా, వైయస్సార్‌ రామరాజ్యం మళ్ళీ చూడాలన్నా... వచ్చే ఎన్నికల్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి వైయస్‌ జగన్‌మోహనరెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం ఇచ్చి వారి సేవలను వినియోగించుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు అమలుకాకపోవడం, ప్రభుత్వం విచ్చలవిడిగా అవినీతికి పాల్పడడంతో విసుగు చెంది టీడీపీ నేతలు వైయస్సార్‌పార్టీలో చేరారని చెప్పారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఎస్‌.ఏ.హనీఫ్, వార్డు నాయకులు షేక్‌.మాబు, అచ్చి శివకోటి, గోగుల మనోహర్‌యాదవ్, చల్లా నాగేశ్వరరావు, యు.కృష్ణ, బి.సంజీవరావు, జి.వెంకటేష్, జి.శ్రీనివాసరావు, శివరాత్రి వెంకటరావు, జి.సుబ్బారావు, జి.అంకమ్మరాజు తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top