<br/>న్యూఢిల్లీ: ఈ నెల 13న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల బృందం కలువనుంది. గత నెల 25న విశాఖ ఎయిర్ పోర్టులో ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్‌పై శ్రీనివాస్ అనే యువకుడు కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన విషయం విధితమే. ఈ ఘటనను రాష్ట్రపతికి వివరించేందుకు పార్టీ నేతల బృందం రాష్ట్రపతిని కలువనుంది. వైయస్ జగన్‌పై జరిగిన దాడి ఘటనపై కేంద్ర ఏజెన్సీతో దర్యాప్తు చేయించాలని వైయస్‌ఆర్‌సీపీ నేతలు రాష్ట్రపతిని కోరనున్నారు. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను వైయస్‌ఆర్‌సీపీ నేతల బృందం కలిసి ఫిర్యాదు చేశారు. అలాగే గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు.