డల్లాస్‌లో మహానేతకు ఘన నివాళిడల్లాస్‌: దివంగత  ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా అమెరికాలోని ఆయన అభిమానులు, డాక్టర్ వైయ‌స్‌. రాజశేఖరరెడ్డి పౌండేషన్‌ సభ్యులు, వైయ‌స్ఆర్‌సీపీ  కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. డల్లాస్‌లో మహానేత వైయ‌స్ఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మహానేత సేవలను, ప్రజాసంక్షేమ పథకాలను గుర్తుచేసుకున్నారు. చిన్న పెద్దా తేడా లేకుండా అందరితోను ఆప్యాయంగా ఉంటారని వైఎస్సార్‌తో ఉన్న తీపి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం వైయ‌స్ఆర్‌ పౌండేషన్‌,  వైయ‌స్ఆర్‌సీపీ నేతల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.


 

తాజా వీడియోలు

Back to Top