డెట్రాయిట్, 9 జూలై 2013:
జన హృదయ నేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 64వ జయంతిని సోమవారంనాడు ఘనంగా నిర్వహించినట్లు డెట్రాయిట్‌లోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం ఓక ప్రకటనలో తెలిపింది. ఆ మహానేతకు ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు ఘనంగా నివాళులు ఆర్పించారు.
ఈ వేడుకలకు హాజరైన ప్రవాసాంధ్రులు మాట్లాడుతూ... వైయస్ రాజశేఖరరెడ్డి తన పరిపాలన ద్వారా కోట్లాది మంది ప్రజల హృదయాల్లో ఎలా కొలువై ఉన్నదీ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌కు, రాష్ట్ర ప్రజలకు ఆ మహానీయుడు చేసిన విశిష్ట సేవలను వారు ప్రస్తుతించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆ అపర భగీరథుడు ప్రవేశపెట్టిన పథకాలను ప్రవాసాంధ్రులు గుర్తు చేసుకున్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి పరిపాలనపై ప్రదర్శించిన వీడియో అందరినీ విశేషంగా ఆకట్టుకున్నది.
ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డికి ప్రవాసాంధ్రులు మద్దతుగా నిలవాల్సిన అవశ్యకతను వక్తలు ఈ సందర్భంగా వివరంగా విశ్లేషించారు. రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి అఖండ మెజారిటీతో విజయ ఢంకా మోగించాలని ప్రవాసాంధ్రులు ఈ కార్యక్రమంలో ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి పదవిని శ్రీ జగన్ అధిష్టించి మహానేత వైయస్‌ఆర్ రాష్ట్రాభివృద్ధికి, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కన్న కలలను సాకారం చేస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి తమ వంతు కృషి చేస్తామని డెట్రాయిట్లోని పార్టీ సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో లింగాల హరిప్రసాద్‌రెడ్డి, వినోద్ కుకునూర్, వెంకట్ బీరం, రమణరెడ్డి పటేలు, సునీల్ మండుటి, వినోద్ ఆత్మకూరు, ఫురుషోత్తం కూకటి, కొండారెడ్డి తొట్టిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పిడపర్తి, శివరాం యార్లగడ్డ, యుగంధర్ భుమిరెడ్డి, సాగర్‌రెడ్డి, శ్రీనివాస్ బర్ల, లోకరెడ్డి, జోగేశ్వరరావు (డిటిఎ మాజీ అధ్యక్షుడు), వేణు సూరపరాజు (డిటిఎ ప్రెసిడెంట్-ఎలెక్టు), కోటిరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, వెంకట్ పాలా తదితరులు పాల్గొన్నారు.