'కువైట్‌కు, ఖతా‌ర్‌లలో వైయస్‌కు నివాళి'

అంతర్వేది (తూర్పుగోదావరి జిల్లా), 4 సెప్టెంబర్‌ 2012 : మహానేత వైయస్‌రాజశేఖరరెడ్డి మూడవ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు కువైట్, ఖతా‌ర్‌లలోని ప్రవాసాంధ్రులు నివాళులర్పించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ప్రవాసాంధ్రులు ఖతార్ రాజధాని దోహాలో ‌వైయస్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. రాష్ట్ర ప్రజలకు వై‌యస్ చేసిన సేవలను‌ ఈ సందర్భంగా వారు గుర్తుచేసుకున్నారు. వైయస్‌ వర్ధంతిని సందర్భంగా దోహాలో నిర్వహించిన వైయస్‌ఆర్ క్రికె‌ట్ టోర్నమెం‌ట్‌లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో దోహా వైయస్‌ఆర్ ఫ్యా‌న్స్‌ అసోసియేషన్ అధ్యక్షుడు వి.ప్రకాశబాబు, ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు తదితరులు ‌పాల్గొన్నారు.

కువైట్‌లోని జబ్రియాలో కూడా తూర్పు, పశ్చిమ గోదావరి, కడప జిల్లాల ప్రవాసాంధ్రులు వైయస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వై‌యస్‌ హయాంలోని స్వర్ణ పరిపాలన ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ రావాలంటే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై‌యస్ జగ‌న్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. అనంతరం, రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ వివరాలు వైయస్‌ఆర్ యువసేన ఈ‌స్ట్‌ అండ్‌ వెస్ట్ గోదావరి కువై‌ట్ కన్వీన‌ర్ దేవ వినో‌ద్, ఖతా‌ర్ నుంచి దోహా వై‌యస్‌ఆర్‌ ఫ్యాన్స్ అసోసియేష‌న్‌ సభ్యుడు రాపాక శేఖర్ మంగళవారం ఈ-మెయి‌ల్ ద్వారా తెలిపారు.

Back to Top