న్యాయస్థానంపై అపార నమ్మకం ఉంది

‘జగన్‌ దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడు’

తాజా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

 తూర్పు గోదావరి : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడని వైయ‌స్ఆర్‌సీపీ తాజీ, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైయ‌స్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసు దర్యాప్తును ఎన్.ఐ.ఎకి ఇస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నామని, న్యాయస్థానంపై తమకు అపార నమ్మకం ఉందని అన్నారు. ఖచ్చితంగా ఎన్.ఐ.ఎ విచారణలో దోషులందరూ బయటపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. హత్యాయత్నం కుట్ర వెనుక ఏపీ ప్రభుత్వ పెద్దలు.. ముఖ్యమంత్రి స్ధాయి వ్యక్తులు ఉన్నారని తాము ఆ గతంలోనే చెప్పినట్లు తెలిపారు.

భగవంతుడు.. ప్రజల ఆశీస్సులతో జగన్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని అన్నారు. జగన్‌.. పాదయాత్ర ద్వారా కొన్ని లక్షల మంది ప్రజలను కలుసుకుని, వారి సమస్యలను విన్నారని చెప్పారు. ఆ సమస్యలు రాబోయే రోజుల్లో ఏలా పరిష్కరించాలో చెబుతూ జగన్ ప్రజలకు భరోసా ఇస్తున్నారని తెలిపారు. ప్రజలకు మనో ధైర్యం ఇస్తూ జగన్ చేస్తున్న పాదయాత్రకు ప్రభుత్వం ఎన్నో ఆటంకాలు కల్పించిందని మండిపడ్డారు. తమ పార్టీకి ప్రజలు అండగా ఉన్నారని, అందువల్ల వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకుని పోటీ చేసే పరిస్ధితి వైఎస్సార్‌ సీపీకి లేదని స్పష్టం చేశారు. 

Back to Top