రాష్ట్ర హక్కుల పరిరక్షణకే ఫెడరల్‌ ఫ్రంట్‌...

వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి,టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌లు ఫెడరల్‌ ఫ్రంట్‌పై చర్చలు జరిపారని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌ లోని వైయస్‌ జగన్‌ నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చర్చల ప్రక్రియకు ఇది ప్రారంభం మాత్రమే అని అన్నారు.

మరో దఫా చర్చలు జరుగుతాయని, తెలంగాణ సీఎం  కేసీఆర్‌ కూడా చర్చల్లో పాల్గొంటారన్నారు.ఫెడరల్‌ ఫ్రంట్‌ యూపీఏ,ఎన్డీయేలకు భిన్నంగా ఉంటుందన్నారు.రాష్ట్ర హక్కుల పరిరక్షణకే ఈ కూటమి అని స్పష్టం చేశారు.ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చేవరుకే వైయస్‌ఆర్‌సీపీ మద్దతు అని పునరుద్ఘాటించారు.

 

Back to Top