అర్హులందరికీ పింఛన్లు ఇచ్చిన ఘనత వైయస్‌ఆర్‌ది

ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి
 

అమరావతి: అర్హులందరికీ పింఛన్లు ఇచ్చిన ఘతన దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిది అని చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో పింఛన్ల పెంపుపై టీడీపీ నేతల ఆరోపణలకు గడికోట శ్రీకాంత్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. గతంలో పింఛన్‌ కావాలంటే ఎవరో ఒకరు చనిపోవాలని అప్పటి ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. అలాంటి పరిస్థితిని దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి మార్చారు. అర్హులందరికీ పింఛన్‌ ఇచ్చారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చాక జన్మభూమి కమిటీలకు లంచం ఇస్తేనే పింఛన్లు ఇచ్చారు.  
 

తాజా వీడియోలు

Back to Top