చంద్రబాబు అవినీతి అంతం చేద్దాం

తాజా మాజీ ఎంపీ వరప్రసాద్‌
 

న్యూఢిల్లీ: చంద్రబాబు అవినీతిని అంతం చేసి వైయస్‌ జగన్‌కు అవకాశం కల్పించాలని వైయస్‌ఆర్‌సీపీ తాజా మాజీ ఎంపీ వరప్రసాద్‌ పిలుపునిచ్చారు.  . విభజన చట్టంలోని హామీలను తీసుకురాలేని అసమర్ధుడు చంద్రబాబు అని విమర్శించారు. విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును కేంద్రం పూర్తి చేయాల్సి ఉందన్నారు.

ముడుపుల కోసమే పోలవరాన్ని బాబు తన భుజాన వేసుకున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నరేగా పనులను కూడా అవినీతి చేస్తున్నారని విమర్శించారు. గోదావరి, కృష్ణా పుష్కరాలకు రూ.2 వేల కోట్లు వృథాగా ఖర్చు చేస్తున్నారని దుయ్యబట్టారు. అభివృద్ధి చేస్తానన్న చంద్రబాబు అవినీతిని వినూత్నంగా చేశారన్నారు. పేదలకు వెళ్లాల్సిన రూ.6 లక్షల కోట్లను చంద్రబాబు అవినీతి చేశారని ఆరోపించారు. అవినీతి డబ్బుతో ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు యత్నం చేస్తున్నారన్నారు. 

 

Back to Top