శ్రీకాకుళం:ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి వెంకటేశ్వరస్వామిని దర్శించుకునే సమయంలో తెలుగుదేశం పార్టీ సంఘ విద్రోహ చర్యలకు పురిగొల్పుతుందనే సమాచారం ఉందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. వైయస్ జగన్‌పై అన్నిరకాల దాడులు చేయించిన చంద్రబాబు ఆ రోజు ఆధ్యాత్మిక దాడి చేయాలనే కుట్రకు తెరతీస్తున్నారనే సమచారం వచ్చిందన్నారు. చంద్రబాబు రాజకీయాలు కోసం ఎంతటి నీచపు కార్యకలాపాలు చేయడానికైనా వెనుకంజ వేయరని తెలిపారు. తమ విషపు పత్రికలు ద్వారా చంద్రబాబు విషప్రచారం చేయిస్తారన్నారు. బుషులు యజ్ఞం చేస్తే రక్తం పోసి రాక్షసులు ఏవిధంగా ఆ యజ్ఞానికి విఘ్నం చేసే ప్రయత్నం చేస్తారో అదేవిధంగా జగన్‌మోహన్ రెడ్డి యజ్ఞంలా చేసిన పాదయాత్ర ద్వారా వచ్చిన యజ్ఞ ఫలాన్ని వెంకటేశ్వరస్వామి పాదాల కింద పెట్టడానికి వెళ్తుండగా..రాక్షసులు వంటి తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్‌మోహన్ రెడ్డి మీద హిందూత్వ దాడి చేసే నీచపు కుట్రలు పన్నుతున్నారని తెలిసిందన్నారు. గతంలో జగన్‌మోహన్‌రెడ్డి వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్ళి నప్పుడు చంద్రబాబు,తమ పచ్చ పత్రికలతో ఇదేమీ దర్శనమని పూర్తిగా అవాస్తవాలు రాయించారన్నారు. తిరుమలలో జై జగన్ అని నినాదాలు చేయించేలా టీడీపీ కుట్రలు చేస్తుందన్నారు. భగవంతుడి కృప, ప్రజల విశ్వాసబలంతో వైయస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర ప్రపంచ రాజకీయ చ్రరితలో సువర్ణ అధ్యాయంగా మిగిలిపోతుందన్నారు భారతదేశ రాజకీయాల్లో గతంలోనూ, వర్తమానంలోనూ, భవిష్యత్‌లో ఎవరూ చేయనంత సుదీర్ఘంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరుకు ఉన్నంత సుదూర దూరం కంటే ఎక్కువ పాదయాత్ర చేశారన్నారు. సుమారు ఒకటిన్నర కోట్ల మంది ప్రజలను ముఖాముఖీగా కలిసి వారి గోడు వింటూ..కన్నీళ్లు తూడుస్తూ మహా సంకల్పంతో పాదయాత్ర సాగిందన్నారు. ఈ నెల 9న పాదయాత్ర ముగియగానే ద్విగిజయంగా జరిగినందుకు వైయస్ జగన్ మొక్కుబడి చెల్లించేందుకు ఇచ్చాపురం నుంచి నేరుగా వెంకటేశ్వరస్వామి సన్నిధిని చేరుకుని కాలినడక ద్వారా తిరుమలకు వెళ్ళి స్వామి దర్శనం చేసుకుంటారన్నారు. వైయస్ జగన్‌మోహన్ రెడ్డి రాజకీయ రంగప్రవేశం చేసినప్పటి నుంచి చంద్రబాబు తన రాజకీయ జీవితానికి పూర్తిగా చరమగీతం పాడే సమర్థ నాయకుడు జగన్‌మోహన్ రెడ్డి అని గ్రహించి తొమ్మిది సంవత్సరాల నుంచి అకారణంగా, అన్యాయంగా ఆయన మీద నిందారోపణలు వేసి, సోనియాతో కలిసి కుట్రలు పన్ని, సిబిఐని ఊసిగొల్పి, తప్పుడు కేసులు బనాయించి ఏడాదిన్నర సంవత్సరాలు బెయిల్ రాకుండా జైలు పంపించిన వ్యక్తి చంద్రబాబు అన్న సంగతి చరిత్ర చెప్పిన సత్యం అని అన్నారు. ప్రతిపక్ష నేతగా అత్యద్భుత పాత్ర నిర్వహిస్తూ చంద్రబాబు పాలనలో మోసాన్ని ఎండగడుతూ, అవిశ్రాంతంగా పోరాడుతూ ప్రజల కోసం వైయస్ జగన్ ఉద్యమాలు చేస్తున్నారన్నారు. వైయస్ జగన్ పాదయాత్ర ప్రారంభించిన రోజు నుంచి చంద్రబాబునాయుడు చేయని దుర్మార్గాలు లేవని, పాదయాత్ర గురించి మాట్లాడని మాటలులేవన్నారు. చంద్రబాబు, ఆయన తాబేదారులు, తొత్తులు, మంత్రులు పాదయాత్ర గురించి అనరాని మాటలు మాట్లాడి పాదయాత్ర ప్రాబల్యాన్ని తగ్గించాలని చూశారన్నారు. హత్యాయత్నం కూడా చేయించారని మండిపడ్డారు.