రేపు వైయ‌స్ జ‌గ‌న్ భీమ‌వ‌రం ప‌ర్య‌ట‌న‌

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేపు (08.10.2025)  పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ప‌ర్య‌టిస్తారు. బుధ‌వారం మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి భీమవరం చేరుకుంటారు, అక్కడి నుంచి పెదఅమిరం చేరుకుని వైయ‌స్ఆర్‌సీపీ  సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు, అనంతరం సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు.

Back to Top