తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ ముఖ్య నేతలతో పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. సుప్రీంకోర్టు తీర్పుపై నేతలతో ఆయన చర్చిస్తున్నారు. సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, కన్నబాబు సహా పలువురు నేతలతో వైయస్ జగన్ సమావేశమయ్యారు. స్వతంత్ర సంస్థతో విచారణ జరపాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై సమాలోచనలు జరుపుతున్నారు. కాగా, మధ్యాహ్నం 2 గంటలకు వైయస్ జగన్ ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై మాట్లాడనున్నారు. తిరుమల లడ్డూ కేసులో చంద్రబాబుకు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తిరుమల లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్లపై నేడు(శుక్రవారం) విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్‌ను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు సర్కార్ ఏర్పాటు చేసిన సిట్‌ను రద్దు చేసింది.