శారదాపీఠాధిపతితో టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి భేటీ

తిరుమ‌ల‌: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పవిత్ర పుణ్యక్షేత్రం రుషికేశ్ వెళ్లారు. రుషికేశ్ లో చాతుర్మాస్య దీక్షలో ఉన్న విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామిని కలిశారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించే విషయంపై స్వరూపానందతో చర్చించినట్టు వైవీ వెల్లడించారు. అంతేకాకుండా, అనేక ధార్మిక అంశాలపైనా శారదా పీఠాధిపతి సలహాలు తీసుకున్నట్టు వివరించారు. కాగా, స్వరూపానందను కలిసిన సమయంలో వైవీ వెంట టీటీడీ ఈవో, అదనపు ఈవో కూడా ఉన్నారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top