వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడి

జమ్మలమడుగు నియోజకవర్గంలో టీడీపీ నేతల అరాచకం

వైయస్‌ఆర్‌ జిల్లా: రాష్ట్రంలో టీడీపీ నేతల అరాచకాలు తారాస్థాయికి చేరుతున్నాయి. జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దముడియం మండలం నెమలిదిన్నెలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. టీడీపీ నుంచి వైయస్‌ఆర్‌సీపీలోకి చేరేందుకు సిద్ధమైన 30 కుటుంబాలు సిద్ధమయ్యాయి.దీంతో  పార్టీ వీడకూడదంటూ టీడీపీ నేతల బెదిరింపులకు దిగారు. బెదిరింపులు చిత్రీకరిస్తున్న వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. టీడీపీ నేతల దౌర్జన్యాలను జమ్మలమడుగు వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి సుధీర్‌రెడ్డి ఖండించారు. బాధితులకు పరామర్శించారు.

 

Back to Top