హిందూపురంలో పోలీసుల అత్యుత్సాహం..

శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా:  హిందూపురంలో పోలీసుల అత్యుత్సాహం  చూపారు. అసెంబ్లీ వేదిక‌గా మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగ‌న్‌పై బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాగమణిపై కేసు నమోదు చేశారు.  టీడీపీ నేతల ఫిర్యాదుతో నాగమణిపై 196, 353,351, 67 సెక్షన్ల కింద ఆమెపై కేసు న‌మోదు చేయ‌డం ప‌ట్ల మ‌హిళ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణ ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు మండిప‌డుతున్నాయి.

Back to Top