ఎన్నికల కోడ్‌ ఎత్తివేతను స్వాగతిస్తున్నాం

వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ నాగిరెడ్డి
 

తాడేపల్లి: ఎన్నికల కోడ్‌ ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ నాగిరెడ్డి అన్నారు. ఎన్నికల కోడ్‌ ఎత్తివేయడంతో ఉగాది నాడు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం యధాతథంగా జరుగుతుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఎన్నికల కమిషన్‌తో కుమ్మక్కై స్థానిక ఎన్నికలను అడ్డుకున్నారని దుయ్యబట్టారు. ఎన్నికలు వాయిదా వేయడం వలన రాష్ట్రానికి రావాల్సిన నిధులను అడ్డుకుందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసే మంచి పనిని అడ్డుకోవాలని ఎన్నికల సంఘం భావించదని, కోర్టుతోనైనా ఈసీ నిద్రమత్తు వీడాలని సూచించారు.

 

Back to Top