దీర్ఘాయుష్షు ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నా

వైయ‌స్ విజ‌య‌మ్మ‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన ఎంపీ విజ‌యసాయిరెడ్డి
 

విశాఖ‌: మహానేత డాక్టర్ వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి గారి ధర్మపత్ని, ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జగన్ గారి మాతృమూర్తి, వైయ‌స్సార్సీపి  గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయ‌స్ విజయమ్మ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీకు  దీర్ఘాయుష్షు ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నా అంటూ వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

‘కాళ్లు పట్టుకున్నా’ కమలం పెద్దల నుంచి స్పందన లేద‌ట‌..
17 తర్వాత పార్టీ లేదు, బొక్కా లేదన్న అచ్చెన్న డిక్లరేషన్ అమల్లోకి వచ్చినట్టే. విలీనం చేస్తామని ‘కాళ్లు పట్టుకున్నా’ కమలం పెద్దల నుంచి స్పందన లేదు. తదుపరి కార్యాచరణపై అను’కుల మీడియా పార్టనర్లతో సమాలోచనలు జరుపుతున్నాడట బాబు. కరోనా పేరుతో మినీ మహానాడు కూడా ఉండదని అంటున్నారు అని టీడీపీ నేత‌ల‌ను ఉద్వేశించి మ‌రో ట్వీట్‌లో విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు.
 

Back to Top