చంద్రబాబు పిల్లల నోరుకొట్టారు 

ఎంపీ విజయసాయిరెడ్డి
 

తాడేపల్లి:  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ రాష్ట్రంలో విద్యార్థుల కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారని ఆయన చెప్పారు. గత సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం తాను తాగే హిమాలయ వాటర్ కు కోట్ల రూపాయలు ఖర్చు చేసి పిల్లల నోరు కొట్టారని విమర్శించారు. విజయసాయిరెడ్డి శుక్రవారం ట్విట్‌ చేశారు.
'జగనన్న గోరుముద్ద, అమ్మ ఒడి కింద ఏటా 15 వేల రూపాయలు, కాలేజీల విద్యార్థులకు 20 వేల వసతి దీవెన, ఇంగ్లిష్ మీడియంలో బోధన. విద్యార్థుల భవిష్యత్తు కోసం రూపొందించిన ఇన్ని పథకాలు ఏ రాష్ట్రంలో కనిపించవు. పిల్లల నోరుకొట్టి మీరు తాగే హిమాలయ వాటర్ కు మాత్రం కోట్లు పోశావు కదా బాబూ!' అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. 
 

తాజా ఫోటోలు

Back to Top