నీ బాధేంటి పప్పు నాయుడు?

వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

విశాఖ‌: ప‌రీక్ష‌ల‌పై టీడీపీ నేత నారా లోకేష్ తీరును వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్టీ పార్ల‌మెంట‌రీ నేత వి.విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎండ‌గ‌ట్టారు. లోకేశ్ లాంటి వింత జీవి భూమ్మీద ఇంకెక్కడా కనిపించడు. టెన్త్, ఇంటర్ పరీక్షలు తనే రాసాడో, బాబు ఇంకెవరితోనైనా రాయించాడో! పిల్లల భవిష్యత్తును నాశనం చేయడానికి పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. కరోనా ప్రోటో కాల్స్ ప్రకారమే ఎగ్జామ్స్ జరుగుతాయి. నీ బాధేంటి పప్పు నాయుడు?

18-45 మధ్య వయసు వారికి ఉచిత వ్యాక్సిన్లు ఇస్తామని మొదట ప్రకటించింది సిఎం వైయ‌స్ జగన్ గారే. ఆ తర్వాతే కేంద్రం ఫ్రీ వ్యాక్సిన్ నిర్ణయం వెల్లడించింది. కరోనాపై కేంద్రానికి నివేదికలు పంపుతుంటానని డప్పు కొట్టుకునే బాబుకు ఇది కనిపించలేదా. విషం చిమ్మడమే కాదు. మెచ్చుకోవడం కూడా నేర్చుకో బాబూ అంటూ విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top