ల్యాండ్ కనిపిస్తే చాలు పచ్చజెండా పాతేశారు

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి  
 

విశాఖ‌:  గ‌త ఐదేళ్ల‌లో టీడీపీ నేత‌లు చేసిన దుర్మార్గాల‌ను ఎండ‌గ‌డుతూ వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. నదీనదాలు, కొండలు, ఎడారులా మనకడ్డంకి అన్న శ్రీశ్రీ మాటలను వారు మరోలా అర్థం చేసుకున్నారు. ల్యాండ్ కనిపిస్తే చాలు పచ్చజెండా పాతేశారు పత్తిపాటి పుల్లన్న. జూబ్లీహిల్స్ సొసైటీ బోర్డునే తొలగించి కబ్జా చేసిన వారికి...విశాఖ భూములు ఒక లెక్కా? వైసీపీ వచ్చిన తర్వాత వీరి కబ్జాలకు తెరపడింది. 

చంద్రబాబు హయాంలో కార్పోరేట్ హాస్పిటళ్లను పెంచి పోషేంచేందుకే పనికొచ్చిన ఆరోగ్యశ్రీని ఈ రెండేళ్లలో సిఎం వైయ‌స్ జగన్ గారు సంజీవనిగా మార్చారు. 95 శాతం మంది ప్రజలు దీని పరిధిలోకి రావడం, కరోనా, బ్లాక్ ఫంగస్ లను ఆరోగ్యశ్రీలో చేర్చి అందరికీ భరోసా కల్పించార‌ని విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

Back to Top