చంద్రబాబు నోరు ఇప్పుడు ఎందుకు పెగలడం లేదు

వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి
 

 విశాఖ‌: సంగం డెయిరీ విషయంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు మౌనం దాల్చ‌డంతో వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్ల‌మెంట‌రీ నేత విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శ్నించారు. గ‌తంలో చంద్రబాబు వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా కౌంటర్ ఇచ్చారు. ఖబడ్దార్.. నీకు ఏసీబీ ఉంటే నాకు కూడా ఏసీబీ ఉందంటూ గర్జించిన చంద్రబాబు నోరు ఇప్పుడు ఎందుకు పెగలడం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబును కర్మ పగబట్టినట్టు తరుముతోందని అన్నారు. రాష్ట్రంలోని వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు నాశనం చేశారని విమర్శించారు. సీఎం వైయ‌స్ జగన్ పాలనతో న్యాయం, ధర్మం మళ్లీ ఊపిరి పోసుకున్నాయని అన్నారు. దోషులెవరూ తప్పించుకోలేరని విజ‌య‌సాయిరెడ్డి హెచ్చరించారు.

Back to Top