తాడేపల్లి: టీడీపీ మళ్లీ అధికారంలోకి రాదని ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడికి బాగా తెలుసు అని వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. అచ్చెం నాయుడు సవాళ్లు చూస్తుంటే టీడీపీలో ఉండేలా లేడు. అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కర్ని వదలం అంటున్నాడు. అచ్చెన్నాయుడు కు బాగా తెలుసు టీడీపీ అధికారంలోకి రాదని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఎమ్మెల్యేల అందరితో రాజీనామా చేసి బాబు రెడీ కావాలి ఎన్నికలకు వెళ్దాం రండి అని చంద్రబాబు సవాలు చేశాడు. మంగళగిరిలో కొడుకుని ఓడగొట్టుకున్న చంద్రబాబు కు ఈసారి కుప్పం కూడా గోవిందా...గోవిందా! కావాలంటే తన ఎమ్మెల్యేల అందరితో రాజీనామా చేసి రెడీ కావాలంటూ అంతకుముందు మరో ట్వీట్ చేశారు.