చంద్ర‌బాబు ప్ర‌వాస ఆంధ్రుడిలా వ‌చ్చారు

ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్‌

తాడేప‌ల్లి: ప‌్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ఏపీకి ప్ర‌వాస ఆంధ్రుడిలా వ‌చ్చార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ విమ‌ర్శించారు. తాడేప‌ల్లిలో శుక్ర‌వారం ఆయ‌న మాట్లాడారు.  రైతుల‌కు రుణాలు మాఫి చేస్తామ‌ని చెప్పి మోసం చేసిన చ‌రిత్ర చంద్ర‌బాబుది అన్నారు. ఉచిత విద్యుత్‌పై చంద్ర‌బాబు మాట్లాడ‌టం హాస్యాస్పదంగా ఉంద‌న్నారు. అక్ర‌మ రాజ‌కీయ పొత్తులు న‌డిపిన చ‌రిత్ర చంద్ర‌బాబుద‌న్నారు. దేవినేని ఉమ తండ్రిపేరుతో క్వారీలు ఉన్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంద‌న్నారు. దేవినేని ఉమా, చంద్ర‌బాబు మాట‌లు న‌మ్మే ప‌రిస్థితిలో ప్ర‌జ‌లు లేర‌న్నారు. గ‌త ప్ర‌భుత్వ అవినీతి అక్ర‌మాల‌పై విచార‌ణ జ‌రిపిస్తామ‌ని వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ హెచ్చ‌రించారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top