వైయ‌స్ఆర్‌సీపీ క్ర‌మ‌శిక్ష‌ణ గ‌ల పార్టీ

మంత్రి శ్రీరంగనాథరాజు
 

అమరావతి: ఎంపీ రఘురామకృష్ణమరాజు కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని మంత్రి శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ గ‌ల పార్టీ అని మంత్రి పేర్కొన్నారు.అన్ని సామాజిక వర్గాలకు సీఎం న్యాయం చేస్తున్నారని మంత్రి అన్నారు. క్షత్రియ సామాజిక వర్గానికి కూడా కేబినెట్‌లో చోటు కల్పించారన్నారు. ఎంపీ రఘురామకృష్ణమరాజు కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని చెప్పారు. ఆయనకు బ్యానర్‌ కట్టే క్యాడర్‌ కూడా లేదన్నారు.వైయస్‌ఆర్‌సీపీ నుంచి పోటీ చేశారు కాబట్టే రఘు గెలిచారన్నారు. రాఘురామకృష్ణంరాజుకు రాజకీయ నాయకుడి లక్షణాలు లేవని కొట్టు సత్యనారాయణ విమర్శించారు. సీఎం వైయస్‌ జగన్‌ ఫొటో పెట్టుకుని రఘురామకృష్ణమరాజు ఎంపీగా గెలిచారని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. టికెట్‌ కోసం రఘురామకృష్ణంరాజు మూడు పార్టీలు మారారని తెలిపారు. 20 రోజుల ముందు పార్టీలో చేరిన వ్యక్తి రఘురామకృష్ణమరాజు అన్నారు.
 

 

తాజా ఫోటోలు

Back to Top