ఓటమి భయంతో టీడీపీ దుష్ప్రచారం

పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
 

 

అమరావతి: స్థానిక సంస్థల్లో ఓడిపోతారనే భయంతో చంద్రబాబు దుష్ప్రచారం చేయిస్తున్నాడని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఉక్రోశంతోనే చంద్రబాబు తనపై ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు వంతపలికే మీడియా, పత్రికలు వలంటీర్లపై అభూతకల్పన వార్తలు రాస్తున్నాయని ధ్వజమెత్తారు. పులివెందుల సతీష్‌రెడ్డి, డొక్కా, రెహమాన్‌ టీడీపీని ఎందుకు వీడారో చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు.

Back to Top