వ్య‌వ‌సాయ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన మంత్రి క‌న్న‌బాబు

అమ‌రావ‌తి: అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా మంత్రి కురసాల కన్నబాబు  వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. మండలిలో డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌ వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ఒక చరిత్ర అన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు రైతులకు కార్యాలయాలు వంటివన్నారు. 1,778 రైతు భరోసా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. నాణ్యమైన యంత్రాల కొనుగోలుకు 40 శాతం రాయితీ ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top