బాబుకు రాష్ట్ర ప్రయోజనాల కన్నా..స్వ ప్రయోజనాలే ముఖ్యం

మంత్రి కన్నబాబు
 

విశాఖ: ప్రతిపక్ష నేత చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాల కన్నా..తన ప్రయోజనాలే ముఖ్యమని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు విమర్శించారు. అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యత ఉండాలనే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రజల ఆకాంక్షను చంద్రబాబు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. కృత్రిమ పోరాటాలు చేస్తూ మాపై బురద జల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబులా మేం గ్రాఫిక్స్‌ చూపించలేమన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆవేదనను ఇప్పటికైనా చంద్రబాబు తెలుసుకోవాలన్నారు.

తాజా వీడియోలు

Back to Top