తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన సభ అట్టర్‌ఫ్లాప్‌

మంత్రి గుడివాడ అమర్నాథ్‌

విశాఖ‌:  తాడేప‌ల్లిగూడెంలో నిన్న జరిగిన టీడీపీ, జనసేన పార్టీల తొలి ఉమ్మడి బహిరంగ సభ అట్ట‌ర్‌ఫ్లాప్ అయ్యింద‌ని మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ పేర్కొన్నారు. సిద్ధం సభకు వచ్చిన జనాభాలో 10 శాతం కూడా రాలేద‌న్నారు. టీడీపీ, జనసేన కూటమి వల్ల క్యాష్‌ ట్రాన్స్‌ఫర్‌ అయ్యిందే తప్ప, ఓటు కాద‌ని స్ప‌ష్టం చేశారు. కాపుల్లో బలం ఉందన్న‌ పవన్‌.. 24 సీట్లకే ఎందుకు పరిమితం అయ్యారని ప్ర‌శ్నించారు. కాపుల ఓట్ల కోసం పవన్‌ను చంద్రబాబు వాడకుంటున్నార‌ని మంత్రి వ్యాఖ్యానించారు.

Back to Top