అన్నమయ్య జిల్లా: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 7వ రోజు(ఏప్రిల్ 3వ తేదీ) షెడ్యూల్‌ను వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశీల రఘురామ్ విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఉదయం 9 గంటలకు అమ్మగారిపల్లె రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరుతారు. సదుం, కల్లూరు మీదుగా దామలచెరువు, తలుపులపల్లి మీదగా తేనెపల్లి చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం తేనెపల్లి, రంగంపేట క్రాస్ మీదుగా సాయంత్రం 3 గంటలకి పూతలపట్టు బైపాస్ దగ్గర బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం పి కొత్తకోట, పాకాల క్రాస్, గదంకి, పనపాకం, ముంగిలిపట్టు, మామండూరు, ఐతేపల్లి క్రాస్, చంద్రగిరి క్రాస్, రేణిగుంట మీదుగా గురువరాజుపల్లె రాత్రి బసకు చేరుకుంటారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశీల రఘురామ్ తెలిపారు.