కాసేపట్లో బీసీ ముఖ్య నేతల భేటీ

తాడేపల్లి:  ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కాసేపట్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ ముఖ్య నేతల సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, వేణుగోపాలకృష్ణ, గుమ్మనూరు జయరాం, జోగి రమేష్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌యాదవ్, పార్థసారధి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, తదితరులు పాల్గొననున్నారు. రానున్న రోజుల్లో బీసీల కోసం  ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై చర్చించే అవకాశం ఉంది.
 

Back to Top