తాడిప‌త్రిలో ప్ర‌జాస్వామ్యం ఖూనీ

మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్  

అనంత‌పురం: తాడిపత్రి లో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింద‌ని మాజీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ మండిప‌డ్డారు. మాజీ ఎమ్మెల్యే పెద్దా రెడ్డి కి మద్దతు ఇచ్చే వారిని రప్పా రప్పా నరుకుతానని జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చార‌ని తెలిపారు. తాడిపత్రి లో హింసా రాజకీయాలు చేస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి పై ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేద‌ని పోలీసుల‌ను, ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. టీడీపీ నేతల దౌర్జన్యాలు, దాడులను పోలీసులు పట్టించుకోరా? అంటూ మండిప‌డ్డారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి లోని ఆయన ఇంటికి వెళితే పోలీసుల కు అభ్యంతరం ఏంటి?, హైకోర్టు ఆదేశాలు అమలు చేయాల‌ని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ డిమాండ్ చేశారు.

Back to Top