తాడేపల్లి: ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన విశ్రాంతి ఐఏఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ ఇక లేరు. శుక్రవారం తెల్లవారుజామున తన నివాస గృహంలో కన్నుమూశారు. ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 1977 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన జన్నత్ హుస్సేన్.. పలు జిల్లాలకు కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. వైయస్ఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే టైంలో.. ఉచిత విద్యుత్ ఫైల్‌పై సంతకం చేశారు. ఆనాడు ఆ ఫైల్ అందించింది ఈయనే. అంతేకాదు.. నాడు ఉచిత విద్యుత్తు పథకం విధివిధానాల్ని ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ హోదాలో రూపొందించింది హుస్సేన్ కావడం గమనార్హం.