మహిళల రక్షణ కోసమే మద్యపాన నిషేధం 

 డిప్యూటీ సీఎం నారాయణస్వామి 
 

 అమరావతి : మహిళల రక్షణ  కోసమని మద్యపాన నిషేధం నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం నారాయణస్వామి పేర్కొన్నారు. ఆ నిర్ణయమే నేరాలకు కారణంగా మారిందని టీడీపీ నేతలు ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావడంలేదన్నారు. మద్యం బాటిళ్లకు కమిషన్‌లు తీసుకోవాల్సిన కర్మ మాకేం పట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యపాన నిషేధం నిర్ణయం వల్ల రాష్ట్రంలోని మహిళలు ఇప్పుడు సంతోషంగా ఉన్నారన్నారు. టీడీపీ పనిగట్టుకొని బురద జల్లే ప్రయత్నాలు చేస్తుందని, సాయంత్రం పెగ్గులు వేసుకోవాలని చెప్పే చంద్రబాబు ముఖ్యమంత్రి ఎలా అయ్యారని ప్రశ్నించారు.
  
 

Back to Top