జనవరి 3న ఏలూరుకు సీఎం వైయస్‌ జగన్‌

పశ్చిమగోదావరి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జనవరి 3వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పర్యటించనున్నారు. వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పైలట్‌ ప్రాజెక్టును ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏలూరులో ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పర్యటనను జయప్రదం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సన్నద్ధమవుతున్నారు. పేదలకు కార్పొరేట్‌ వైద్యసేవలు అందించే బహృత్తర కార్యక్రమ ప్రారంభోత్సవం చిరస్థాయిగా నిలిచిపోయేలా పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Back to Top