స్టాళ్లను పరిశీలించిన సీఎం వైయస్‌ జగన్‌

చిత్తూరు: జగనన్న అమ్మఒడి పథకం ప్రారంభోత్సవ సభాస్థలికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేరుకున్నారు. కాన్వాయ్‌ దిగిన సీఎంకు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం పీవీకేఎన్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం వైయస్‌ జగన్‌ పరిశీలించారు. జగనన్న మధ్యాహ్న భోజన పథకం స్టాల్‌ వద్ద వంటలను సీఎం రుచి చూశారు. సభా స్థలి వద్ద సీఎం వైయస్‌ జగన్‌కు చిన్నారులు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.

Back to Top