స్కూల్ ఎడ్యుకేషన్‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష

తాడేప‌ల్లి: స్కూల్ ఎడ్యుకేషన్ పై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. 


స‌మీక్ష ముఖ్యాంశాలు:

  • రాష్ట్రవ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు పంపిణీ పూర్తయిందని వెల్లడించిన అధికారులు.
  •  ట్యాబుల మెయింటైనెన్స్‌కు సంబంధించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సర్వీస్‌ సెంటర్‌ను కంపెనీ ద్వారా ఏర్పాటు చేస్తున్నామన్న అధికారులు.
  •  ట్యాబుల్లో ఎలాంటి సమస్య ఉన్నా వారంరోజుల్లో మరమ్మత్తు చేసి లేదా కొత్త ట్యాబును విద్యార్థికి అందించాలని సీఎం ఆదేశం.
  •  ట్యాబుల వాడకం? పాఠాలను నేర్చుకుంటున్న తీరు తదితర అంశాలపై ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్న అధికారులు.
  •  డేటా అనలిటిక్స్‌ ద్వారా విద్యార్థులు నేర్చుకుంటున్న తీరుపై నిరంతర పరిశీలన ఉండాలని, దీనికి అనుగుణంగా హెడ్‌ మాస్టర్‌, ఎంఈఓలు తగిన విధంగా చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి .
  •  తరగతి గదుల డిజిటలైజేషన్‌లో భాగంగా ఐఎఫ్‌పి ప్యానెల్స్‌ ఏర్పాటుపై తీసుకుంటున్న చర్యలను వివరించిన అధికారులు.
  •  వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యే నాటికి ఐఎఫ్‌పి ప్యానెల్స్‌ ఏర్పాటు కావాలని సీఎం ఆదేశం.
  •  నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ వద్దన్న సీఎం.
  •  ఈ డిజిటల్‌ స్క్రీన్లు వల్ల విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందాలన్న సీఎం.
  •  వీటిని ఉపయోగించుకుని ఎలా బోధన చేయాలో టీచర్లకు చక్కటి అవగాహన, శిక్షణ కల్పించాలన్న సీఎం.
  •  పిల్లలు అందరివద్దా డిక్షనరీలు ఉన్నాయా? లేవా? మరోసారి పరిశీలన చేయాలన్న సీఎం.
  •  లేని పిల్లలు అందరికీ డిక్షనరీలు ఇవ్వాలన్న సీఎం.
  •  వచ్చే విద్యా సంవత్సరం విద్యాకానుక కోసం అన్నిరకాల ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం ఆదేశం.
  •  విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పిల్లలకు విద్యాకానుక అందాలన్న సీఎం. 
  •  పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా చూసుకోవాలన్న సీఎం.
  •  ఏ స్కూల్లో లేకపోయినా వెంటనే టీచర్లు ఉండేలా చూసుకోవాలన్న సీఎం.
  •  సబ్జెక్టుల వారీగా టీచర్లను పెట్టడం వల్ల బోధనలో నాణ్యత పెరుగుతుందని, విద్యార్థుల అభ్యాసం కూడా మెరుగుపడుతుందన్న సీఎం.
  •  డీఎస్సీ 98 అభ్యర్థులకు పోస్టింగులు త్వరగా ఇవ్వాలని సీఎం ఆదేశం.
  •  గోరుముద్ద నాణ్యతను నిరంతర పరిశీలన చేయాలన్న సీఎం.
  •  అన్ని స్కూళ్లు, అంగన్వాడీలకు సార్టెక్స్‌ ఫోర్టిఫైడ్‌ బియ్యం మాత్రమే సరఫరా చేయాలని సీఎం ఆదేశాలు.
  •  నాణ్యత విషయంలో ఎలాంటి రాజీవద్దన్న సీఎం.
  •  సీఎం ఆదేశాల మేరకు ప్రత్యేక లేబుల్‌తో ఈ బియ్యాన్ని అన్ని పాఠశాలలు, అంగన్వాడీలు, అన్ని గురుకులపాఠశాలలకు, హాస్టళ్లకు సరఫరా చేస్తున్నట్టు తెలిపిన అధికారులు.
  •  ఇప్పుడు ఇస్తున్న ఆహారానికి అదనంగా స్కూలు పిల్లలకు బెల్లంతో రాగి మాల్ట్‌ ఇవ్వాలని సీఎం ఆదేశం.
  • పిబ్రవరి 1వ తేదీ నుంచి రాగిమాల్ట్‌ సరఫరా చేయాలని ఆదేశం.
  •  వారానికి మూడు రోజులు పిల్లలకు గ్లాసుడు రాగిమాల్ట్‌.
  •  ఐరన్, కాల్షియం లోపం నివారణకు ఇది ఉపయోగపడుతుందన్న సీఎం.
  •  నాడు – నేడు కింద బాగుచేసిన పాఠశాలల్లో సౌకర్యాల నిర్వహణపై నిరంతర పరిశీలన ఉండాలన్న సీఎం.
  •  ఎస్‌ఎంఎఫ్, టీఎంఎఫ్‌ నిధులను వినియోగించుకుని ఏ సమస్య వచ్చినా వెంటనే మరమ్మతులు చేపట్టాలన్న సీఎం.
  •  నాడు –నేడు రెండో దశ పనులనూ సమీక్షించిన సీఎం.
  •  22 వేలకుపైగా స్కూళ్లలో పనులు నడుస్తున్నాయన్న అధికారులు.
  •  దాదాపు రూ.1500 కోట్లు విలువైన పనులు ఇప్పటికే  జరుగుతున్నాయన్న  అధికారులు.
  • ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహనిర్మాణ, గ్రామ వార్డు సచివాలయాలశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, విద్యాశాఖ సలహాదారు ఏ సాంబశివారెడ్డి, ఇంటర్‌ మీడియట్‌ విద్య కమిషనర్‌ ఎం వీ శేషగిరిబాబు, పాఠశాల మౌలిక వసతులు కల్పన కమిషనర్‌ కాటమనేని భాస్కర్, పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ జీ వీరపాండ్యన్, మిడ్‌ డే మీల్స్‌ డైరెక్టర్‌ నిధి మీనా, నాడు నేడు డైరెక్టర్ (టెక్నికల్) మనోహర్ రెడ్డి 
  • మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ ఏ సిరి, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ (పాఠశాల విద్యాశాఖ) ప్రతాప్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Back to Top